ప్రణాళిక

ఈ పాఠ్య ప్రణాళికలో, ''పరిశోధకులు: దేవుని రాజ్యమును పరిశోధిస్తారు'' మీరు మీ తరగతి విజయవంతం చేసుకోవడానికి వివిధములైన సాధనాలు ఇక్కడ మీ కొరకు ఉన్నాయి.ప్రణాళిక

1. ఉపాధ్యాయుల కొరకు

తరగతి విషయమై కేంద్రికరించుటకు ఉపాధ్యాయుల కొరకు ముఖ్య పాఠములు మరియు ఆలోచనలు.

2. ఆట

ప్రపంచ వ్యాప్తముగా తరగతులలో విద్యార్థులు దాదాపు 90 శాతం విసుగుకు గురవుతుాంరని అధ్యయనాలు చెబుతున్నాయి. మీ విద్యార్థులు విసుగు చెందకుండా, చురుకుగా ఉండానికి ఆటలను ఉపయోగించండి. ఆటతో, మీ విద్యార్థులు తిరగడమును చూస్తారు, అలాగే వారు ముఖ్య పాఠముపై కేంద్రీకరించునట్లుగా సహాయము చేయండి.

3. విజువల్‌ ఏడ్‌ (దృశ్య తరగతులు)

పాఠమును పరిచయం చేయడానికి ఇది వినోదాత్మకమైన మార్గం లేక ప్రతీ వారము మీ ఇంి నుండి మీరు తీసుకొని వచ్చేదానితో మీ తరగతిని ఇంకా బాగా తీర్చిదిద్దవచ్చు.

4. ప్రశ్నలు

పాత విద్యార్థుల కొరకు మరియు ఉపమానముల భావాలను వారు అర్థము చేసుకొనుచున్నారని తెలుసుకొనుటకు మాత్రమే ఈ ప్రశ్నలు ఇవ్వబడియున్నాయి.

5. జవాబులు

విద్యార్థుల పుస్తకములలో చర్యలన్నికి జవాబులు ప్రతి పాఠము కొరకు పేజినందు కుడి వైపున ఉంాయి.

విద్యార్థి పుస్తకం

తరగతిని ఎక్కువ వినోదాత్మకముగా చేసుకోవడానికి మరియు విద్యార్థుల దృష్టిని కాపాడడానికి ఉపాధ్యాయులకు విద్యార్థుల పుస్తకాలే మంచి సాధనాలు.

క్రింద పేర్కొనబడినవన్నియు విద్యార్థుల పుస్తకాలలో చేర్చబడియుండును :

  • బైబిల్‌ వాక్య భాగము - బైబిల్‌ వాక్య భాగమును పుస్తకాలలో ముద్రించాము. తద్వారా తరగతిలో అందరు ఏకంగా బైబిల్‌ వాక్య భాగమును చాలా సులభంగా చదువవచ్చును.
  • కంఠత వాక్యం
  • పజిల్‌ చర్య
  • రహస్య సందేశం (ఎక్కువ వయస్సు కలిగిన విద్యార్థుల కొరకు) - ప్రతి వారము రహస్య సందేశాన్ని ఛేదించడానికి నియమాలను అనుసరించండి మరియు ప్రతీ విద్యార్థి డికోడర్‌ తాళము కలిగియుండునట్లుగా చూడండి.
  • మత్తయి సువార్తను చదువుట (పెద్ద విద్యార్థుల కొరకు) - బైబిలును ఎక్కువగా చదవానికి, మీ విద్యార్థులను తర్ఫీదు చేయడానికి మీకిచ్చే అదనపు కార్యక్రమము. మత్తయి సువార్త పుస్తకమును వారానికి 2 లేక 3 అధ్యాయాలుగా విభజించబడుతుంది. తద్వారా విద్యార్థులు వారపు ఇంి పనిగా పరిగణించుకొని బైబిలును చదివినట్లయితే, ఈ పాఠ్య ప్రణాళిక యొక్క 13 వారాలలో మత్తయి సువార్త పుస్తకమును విద్యార్థులు చదివి పూర్తి చేయగలరు. ఈ కార్యక్రమముతో మీ విద్యార్థులు విజయాన్ని పొందాలని మీరు ఆలోచించినట్లయితే చదివించే కార్యక్రమాన్ని ఎలా ఇవ్వాలన్నది ఉపాధ్యాయులైన మీపైన ఆధారపడియుంటుంది!

రహస్య సందేశాలు మరియు డికోడర్‌ తాళం డికోడర్‌

ఉన్నత మరియు ఆధునిక పుస్తకములను ఉపయోగిస్తున్న విద్యార్థుల కొరకు

ప్రతీ వారము పేజి మీద ఎక్కడో ఒక దగ్గర దాచబడిన రహస్య కోడ్‌ ఉంటుంది. మీ రహస్య డికోడర్‌ సహాయముతో మీరు తెలుసుకొని, ప్రతీ అక్షరమును కనుగొని, మీకివ్వబడిన చిక్కు ముడిని విప్పండి. ఈ విభాగపు చివరిలోపు ఒక్కొక్క అక్షరమును ఒక దాని ప్రక్కన ఒకి జోడించుకుంటూ రండి. అప్పుడే మీరు జవాబును కనుగొనగలరు! ఇంకా మరిన్నిని ఇక్కడ చూడండి డికోడర్.‌

కత్తరించు మరియు అతికించు

మధ్యస్థం మరియు ప్రాథమిక పుస్తకములను ఉపయోగిస్తున్న విద్యార్థుల కొరకుస్టిక్కర్‌కలరింగ్ పేజీ

పిల్లలందరూ స్టిక్కర్లను బాగా ప్రేమిస్తారు! యౌవ్వనులైన విద్యార్థుల కొరకు, వారి పుస్తకాలలోని పాఠపు పేజినందు ఆ స్టిక్కర్‌ను కత్తరించి, అతతికించునట్లుగా మేము వారానికి ఒక చర్యను ఇచ్చాం. పిల్లలు చుక్కలు చుక్కలుగా ముద్రించిన ఆ లైన్ల లోపలి భాగములో ఆ స్టిక్కర్లను అతికించి, ఆ బొమ్మకు రంగులు వేయాలి. డౌన్‌లోడ్‌: స్టిక్కర్‌ (pdf, 1.8 ఎంబి)