ప్రణాళిక వేసుకోవడం
సులువైన వీబీఎస్
మీ చేతిలో చాలా సులువైన వీబీఎస్ ఉంది, దీన్ని వివరించడం కూడా సులువే, చేయడమూ సులువే. కేవలం ఓ రోజును ఎంచుకుని, కొంతమంది కార్యకర్తలను జమ చేసి, మీ పరిసరాల్లో కొన్ని ఆహ్వాన పోస్టర్లను వేలాడదీయండి, మీరు ఇప్పుడు పని మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు!
ఎక్కువ మంది సిబ్బంది ఉంటే వీబీఎస్లో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ మరింత సరదాగా ఉంటుంది, కాబట్టి మేం ఎక్కువమంది పాల్గొనేలా చేయడానికి పనిని వివిధ పాత్రల్లోకి విభజించాం.
మీ వీబీఎస్ పనిభారాన్ని విభజించుకోవడానికి కొన్ని సూచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
1 వీబీఎస్ దర్శకుడు
1 పాటకు నేతృత్వం వహించే వ్యక్తి
1 ప్రధాన పాఠం బోధకుడు
2 నాటిక కోసం నటులు (కెప్టెన్ మరియు రోబో)
1 క్యాడెట్ తరగతి సమన్వయకర్త ( విద్యార్థి పుస్తకాలతో ఉన్న తరగతి)
1 ఇంజనీరింగ్ (కళాత్మక వస్తువుల) సమన్వయకర్త
1 మెస్ హాల్ (అల్పాహారం) సమన్వయకర్త
1 ఆటల సమన్వయకర్త
చిన్న బృందాలకు 6-8 మంది నాయకులు, మీ వీబీఎస్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి
నాటకాలు/చిత్తుప్రతులు
ప్రతీ రోజూ అంతరిక్ష నౌక ‘గెలాక్సీ ఎక్స్ ప్రెస్’లో పిల్లలకు తన సహాయకుడైన రోబో సహాయంతో కెప్టెన్ నాయకత్వం వహిస్తాడు.
మీ కెప్టెన్ గంభీరమైన వ్యక్తిగా ఉంటాడు, ఎందుకంటే అతను నౌకకు, దాంతో పాటే ఆ వారంలో పిల్లలు ఆధ్యాత్మిక సమాచారాన్ని తెలుసుకునే విషయంలో బాధ్యతంతా అతనిదే కాబట్టి. అతను తన సహాయకుడు రోబోను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు: మొద్దుగా ఉండడంతో పాటు, ఒక్కోసారి వైఫల్యం చెందే రోబో అది. కొన్నిసార్లు రోబో మాట్లాడుతున్నప్పుడు, మాటలకు బదులుగా గొణుగుతూ, వికృతమైన శబ్ధాలతో ముగిస్తుంది. అది కదులుతూ ఉండడానికి దాని కీళ్లలో కందెన ఉండాల్సి ఉంటుంది.
ప్రతీరోజూ కూడా కెప్టెన్ మరియు రోబో ఆ రోజు ప్రధాన అంశాన్ని పరిచయం చేస్తారు, పిల్లలు దాన్ని విన్న ప్రతీసారి దానికి స్పందించాల్సి ఉంటుంది. పిల్లలు తమ చిన్న బృందాల్లో వినబోయే స్పేస్ అప్లికేషన్ గురించి కూడా కెప్టెన్ పరిచయం చేస్తాడు.
నాటికల ఆలోచనలు ప్రతీరోజూ వీబీఎస్ను ప్రారంభించడానికి ఇవ్వబడ్డాయి. కానీ మీరు వాటితో రోజును కూడా ముగించవచ్చు, లేదా ఆ పాత్రలు ఆటల్లో పాల్గొనేలా, లేదా వెళ్లి తరగతులను దర్శించేలా కూడా చేయవచ్చు. కెప్టెన్ మరియు రోబో గురించి తెలుసుకోవడాన్ని పిల్లలు ఎంతో ఇష్టపడతారు!
నటనలో జీవించండి!
ప్రతీరోజు, విద్యార్థులు ఆ రోజుకు సంబంధించిన వాక్యాన్ని నేర్చుకుంటారు, దానికి తమ నటనతో స్పందిస్తారు. ఈ క్రియ చాలా ముఖ్యమైనది, దాని వల్ల మీ పిల్లలు ప్రధాన ఉపన్యాసం సమయంలో విసుగు చెందకుండా ఉండగలరు, కానీ అది మీ మొత్తం వీబీఎస్ను ప్రత్యేకంగా మార్చేస్తుంది. మీ మొత్తం వీబీఎస్ అంతా, ఎప్పుడైతే నాయకుడు ఆ వాక్యాన్ని చెబుతాడో, విద్యార్థులంతా దానికి సంబంధించిన నటనతో స్పందించాల్సి ఉంటుంది. దాన్ని వాళ్లు కెప్టెన్ మరియు రోబోతో కలిసి నాటిక సమయంలో నేర్చుకుంటారు, దాన్ని మీరు తర్వాత రోజంతా ఉపయోగించుకోవచ్చు.
సందేశానికి సమాధానం
పాఠం 1
నాయకుడు: “దేవునికి మొరపెట్టుకోండి”
విద్యార్థులు:
“దేవా, నాకు సహాయం చేయి!” దేవుని వైపు రెండు చేతులనూ చాస్తూ దూకేటప్పుడు చెప్పాలి.
సందేశానికి సమాధానం
పాఠం 2
నాయకుడు: “దేవునికి స్పందించండి”
విద్యార్థులు:
“ఔను, దేవా!” వారి చేతులను చెవులకు పెట్టుకుని చేయాలి. తర్వాత సైనికుడిలా తమ కాళ్లను ఒక్కచోట చేర్చి కదుపుతూ,
"నేనిక్కడ ఉన్నాను!"అని చెప్పాలి.
సందేశానికి సమాధానం
పాఠం 3
నాయకుడు: “దేవునికి కట్టుబడండి”
విద్యార్థులు:
“నేను తప్పనిసరిగా కదలాలి” వాళ్లు నిలబడి చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఇతర విద్యార్థులతో సీట్లు మార్చుకుంటున్నప్పుడు అనాలి.
సందేశానికి సమాధానం
పాఠం 4
నాయకుడు: “దేవుని యందు నిరీక్షించండి!”
విద్యార్థులు:
“నేను సిద్ధం” అని వాళ్లు దూకి బాక్సింగ్ చేస్తున్నప్పుడు చెప్పాలి.
“కానీ నేను నిరీక్షించాలి.” అని చేతులు దగ్గరకు తీసుకుని తిరిగి కూర్చునేటప్పుడు చెప్పాలి.
సందేశానికి సమాధానం
పాఠం 5
నాయకుడు: “దేవుడిని ఆరాధించండి”
విద్యార్థులు:
“నేను నిన్ను ఆరాధిస్తున్నాను” అని ఆకాశంవైపు చేతులు చాస్తూ వెనుకకూ ముందుకూ ఆడించేటప్పుడు చెప్పాలి.
ఆటలు
ఈ కార్యక్రమంలో ఆటలన్నీ కూడా పిల్లలంతా పెద్ద గుంపుగా కూర్చుని, ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఆడుకునేవి. (మీరు 2 నుంచి 4 బృందాలు కలిగి ఉండొచ్చు.) సులువైనదల్లా బాలురతో బాలికల పోటీ. ప్రతీ ఆటలోనూ, బృందాలు తమకు ప్రాతినిధ్యం వహించడానికి కొంతమంది కార్యకర్తలను పంపిస్తాయి, మిగిలినవారు తమ కుర్చీల్లోనే ఉండి అరుస్తూ, ప్రోత్సహిస్తూ, నవ్వుతూ తమ వారికి సహాయం చేస్తారు. దాని వల్ల పిల్లలు విసుగు చెందరు, ప్రతీ రోజూ చాలా విభిన్నమైన ఆటలు ఆడుకుంటారు, కొంతసేపటికో సారి, కార్యకర్తలను మార్చుతుండాలి.
ఆటల్లో ముందుగా ఎవరు పాల్గొనాలన్నది నిర్ణయించడానికి ఓ సలహా ఏమిటంటే, మీ వీబీఎస్ కార్యక్రమంలో చక్కగా ప్రవర్తించే పిల్లలను ఎంచుకోవడమే. వారు ఆడడానికి వెళ్తున్నట్లు చెప్పడానికి వారి చేతికి ఏదైనా అందించండి. అది వారి మెడ చుట్టూ వ్రేలాడ దీసుకునేదైనా, మణికట్టుకు కట్టుకునేదైనా, వారి జేబులో పెట్టుకునే కార్డైనా కావచ్చు.
ప్రతీ ఆటకు, మీరు ఎంత ముందునుంచీ సిద్ధమైతే, ఆట అంత బాగా ఉంటుంది. మీరు ఈ ఆటలకు సిద్ధమయ్యే ముందు “గేమ్ షో” లేదా “నికలోడియన్” టీవి కార్యక్రమాలను చూడండి. మీరు ప్రకాశవంతమైన వస్త్రాన్ని ముందు పెట్టుకోవడానికి విద్యార్థులకు ఇవ్వండి, ఆటల సమయం కోసం అద్భుతమైన శబ్ధాలను లేదా సంగీతాన్ని, మరియు సరదా అలంకరణను కూడా ఏర్పాటు చేయవచ్చు. (గెలాక్సీ ఎక్స్ ప్రెస్ మ్యూజిక్ నుంచి ఆట సమయం పాటను మీ కోసం అందుబాటులో ఉంచాం.) చౌకగా దొరికే వస్తువుల ద్వారా మీరు మీ వీబీఎస్ను మరింత సరదాగా మార్చుకోండి. కాబట్టి సిద్ధం కండి.. సరదాను అనుభవించండి!
ప్రణాళిక
(2½ గంటల కార్యక్రమం)
వంతెన అందరూ ఒకే పెద్ద గుంపుగా (50 నిమిషాలు)
- పాటలు (20 నిమిషాలు)
- నాటకం (10 నిమిషాలు)
- గుర్తించుకోవాల్సిన వాక్యంతో ప్రధాన పాఠం (20 నిమిషాలు)
వయస్సుల ఆధారంగా విభజించబడిన 3 చిన్న బృందాలతో కేంద్రాల చుట్టూ తిరగడం (1గంట)
- క్యాడెట్ తరగతి విద్యార్థి పుస్తకాలతో (20 నిమిషాలు)
- ఇంజనీరింగ్ కళాత్మక వస్తువుల ప్రాజెక్టుతో (20 నిమిషాలు)
- మెస్ హాల్ అల్పాహారం మరియు స్పేస్ ఫాక్టోయిడ్తో (20 నిమిషాలు)
వంతెన పెద్ద బృందంలో మళ్లీ ఆటలు (30 నిమిషాలు)
ముగింపు పాట మరియు ప్రకటనలు (10 నిమిషాలు)
తిరిగే కేంద్రాలు
ప్రతీ రోజు మధ్యలో, విద్యార్థులు మూడు బృందాలుగా విభజించబడి కేంద్రాల చుట్టూ తిరుగుతారు: మెస్ హాల్ (అల్పాహారం మరియు స్పేస్ అప్లికేషన్), ఇంజనీరింగ్ (కళాత్మక వస్తువులు), మరియు క్యాడెట్ తరగతి (విద్యార్థి పుస్తాకలు మరియు పాఠం పునశ్చరణ).
మెస్ హాల్
అల్పాహారం మరియు స్పేస్ అప్లికేషన్
ఇక్కడ మీరు అల్పాహారం ఎలా తయారు చేయాలన్నదానికి సూచనలు తెలుసుకుంటారు. విద్యార్థులు కళాత్మక వస్తువుల తరహాలోనే తాము తినడానికి ముందు అల్పాహారాన్ని తయారు చేసుకోవడాన్ని ఇష్టపడతారని మీరు గుర్తుంచుకోండి. తిన్న తర్వాత వారిని వారు శుభ్రం చేసుకోవాలన్న విషయాన్ని చెప్పే అవకాశాన్ని వదులుకోకండి.
ఫాక్టోయిడ్ (అల్పాహార సమయంలో చర్చించడానికి స్పేస్ అప్లికేషన్)
అల్పాహార సమయంలో, స్పేస్ అప్లికేషన్ గురించి, అది పాఠానికి మరియు దినసరి జీవనానికి ఎలా సంబంధించిందో విద్యార్థులతో చర్చించండి. అల్పాహారం మరియు స్పేస్ అప్లికేషన్కు సంబంధించిన సమాచారాన్ని మెస్హాల్ నాయకుడి కరపత్రంలోనూ చూడవచ్చు.
ఇంజనీరింగ్
కళాత్మక వస్తువుల కేంద్రం
ఇక్కడ మీరు కళాత్మక వస్తువు కోసం ఆలోచనను, దానికి అవసరమైన వస్తువులు మరియు సూచనలను పొందుతారు. గెలాక్సీ ఎక్స్ ప్రెస్ వీబీఎస్ కార్యక్రమంలోని అన్ని కళాత్మక వస్తువులు కూడా ఖర్చు భరించేలా ఉండడానికి ప్రతీదీ ఒక కాగితం ముక్క తోనే, తయారయ్యేలా రూపొందించబడింది. ఆన్లైన్లోని నమూనాను డౌన్లోడ్ చేసుకోండి, కళాత్మక వస్తువు యొక్క సమచారాన్ని ఈ దర్శకుడి చేతి పుస్తకంలోనూ మరియు ఇంజనీరింగ్ నాయకుడి కరపత్రంలోనూ చూడండి.
క్యాడెట్ తరగతి
విద్యార్థి పుస్తకాలు మరియు పాఠాల సమీక్ష
ఇక్కడ మీరు కొన్ని బైబిల్ కథలోని కీలక పదాలను సంకేత భాషలో గమనిస్తారు. కథను సమీక్షించండి, ఈ పదాలను సంకేత భాషలో బోధించండి. ఆ తర్వాత విద్యార్థి పుస్తకాలను అందించి, పజిల్స్ విషయంలో ప్రతీ ఒక్కరికీ సహాయం చేయండి. ఈ సమాచారం క్యాడెట్ తరగతి నాయకుడి కరపత్రంలోనూ ఉంటుంది.
ఉదాహరణ: కుటుంబం
బొటన వేలిని చూపుడు వేలిని తాకిస్తూ, చేతులు కలుసుకునే వరకూ బయటి వైపు వృత్తంలా తిప్పండి.