హోమ్ గెలాక్సీ ఎక్స్ ప్రెస్
గెలాక్సీ ఎక్స్ ప్రెస్ వీబీఎస్ కార్యక్రమానికి స్వాగతం!
మీ చర్చ్ లేదా క్లబ్ ప్రాంతం స్పేష్ షటిల్ “గెలాక్సీ ఎక్స్ ప్రెస్”లా మారిపోవడం చూసి బోధకులు ఎంతో ఆనందిస్తారు, దేవుడి యొక్క అద్భుతాలను తెలుసుకోవడానికి విశ్వంలోకి ప్రతీరోజూ బృందమంతా వెళ్తుంది. పిల్లలు అంతరిక్షంలో ప్రయాణిస్తున్నప్పుడు వింత అనుభూతులకు లోనవుతారు, స్పేష్ షిప్ ఎడమకు, కుడి వైపుకు వంగుతూ వెళ్లడం వల్ల వాళ్లు విశ్వంలో దూసుకొచ్చే గ్రహ శకలాలను తప్పించుకుంటున్నట్లు అనుభూతి చెందుతారు. టేకాఫ్ మరియు ల్యాండింగ్ సమయంలో వినిపించే శబ్ధాలు పిల్లల ఊహలకు ప్రాణం పోస్తాయి, దాంతో పాటే కెప్టెన్ మరియు అసిస్టెంట్ రోబోతో దినసరి నాటికలూ ఉంటాయి.
ప్రతీ రోజూ మీరు పిల్లలను చంద్రుడిపైనో, నక్షత్రం పైనో లేదా మరో గ్రహం పైనో ఉన్న స్పేస్ స్టేషన్కు తీసుకువెళ్తారు, అక్కడ మోసే జీవితం ఆధారంగా దేవుడి గొప్పతనాన్ని వారు నేర్చుకుంటారు. సంగీతాన్ని, పాటలకు అనుగుణంగా అనుకరణలు కలిసికట్టుగా చేస్తూ ప్రతీ ఒక్కరూ ఆనందిస్తారు.
“వంతెన”పై గడిపిన తర్వాత, పిల్లలను వయస్సుల వారీగా తరగతులుగా విభజించబడి డాకింగ్ బేకు వెళ్తారు, పాఠంలోని స్పేస్ అప్లికేషన్ను, దాంతో పాటే విద్యార్థి పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాన్ని అక్కడ వారు నేర్చుకుంటారు. తరగతి పూర్తైన తర్వాత, షటిల్లో తిరుగుతూ, వస్తువులతో పనిచేయడానికి ఇంజనీరింగ్ విభాగానికి, అల్పాహారం కోసం మెస్కు వెళ్తారు. ఈ చిన్ని బృందాల్లో, మీ విద్యార్థులు ఒకరినొకరు మరియు వారి బోధకులను తెలుసుకుంటారు, కొత్త స్నేహాలతో ఏడాది పాటు సాగుతారు.
రీక్రియేషన్ గదిలో కొంత సరదా కార్యక్రమంలో వీబీఎస్ను ముగించడానికి, కొత్త గెలాక్సీ ఎక్స్ ప్రెస్ పాటల్లోని ఒక్క పాటతోనే పిల్లలందర్నీ వెనక్కి పిలవడం ఎంతో సులువుగా ఉంటుంది. కొన్ని పాటలు, ఓ ప్రార్థనతో మీ రోజును ముగించండి, మరుసటి రోజు వీబీఎస్కు హాజరుకమ్మని వారిని ఆహ్వానించడం మరిచిపోకండి!
మీరు ఈ వెకేషన్ బైబిల్ స్కూల్ను ఆనందిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఇందులో ఎంతో సృజనాత్మకతను జోడించాలని, దీన్ని ఈ లోకేతరంగా తీర్చిదిద్దాలని నాకు తెలుసు!