పిల్లలే ప్రముఖులు మా గురుంచి మమ్ములను సంప్రదించి సండే స్కూల్ కార్యక్రమాలు మై సిఎంయు: శిక్షణ
ఒక వినూత్నమైన, ఆసక్తికరమైన “ఒంటె సాహసాలు” అనే విబిఎస్ కార్యక్రమానికి సుస్వాగతం! భ్రష్టు పట్టిన ఈ లోకములో ధైర్యముగా దేవునిని అనుసరించడానికి మనము నేర్చుకొనబోయే తరుణములో ఇశ్రాయేలీయులు తమ చెరలో ఉన్నప్పుడు చేసినట్లుగా ఒంటెలతోను మరియు సామ్రాజ్యములతో సాహసోపేతమైన కార్యాలను చేయుటకు మీ పిల్లలను తీసుకు వెళ్ళండి. ఈ కార్యక్రమములో మనము దానియేలు మరియు తన స్నేహితులైన షద్రక్, మేషాక్, అబెద్నగో అనువారి జీవితాలను అనుకరిస్తాం. రాణియైన ఎస్తేరు కూడా 4వ పాఠంలో మీ విబిఎస్ అతిథిగా రానున్నారు.
ఈ విబిఎస్ కార్యక్రమములో ప్రతిరోజు పిల్లలందరూ నిజ జీవితములోనుండి ఆధునిక మలుపులతో హాస్యాస్పదమైన ఒంటెలను (పప్పెట్స్ లేక నటినటులు) తెలుసుకోవడానికి ఎంతగానో ఇష్టపడుతారు. ఈ విబిఎస్ కార్యక్రమము యొక్క అంశమును బలపరిచే నిజమైన నృత్య పాటలను ఆస్వాదించండి. పాఠ అంశముతోపాటు సంతోషముగా నాట్యము చేయడానికి పిల్లలకు నేర్పించండి మరియు ముఖ్య పాఠం ద్వారా ఆ నృత్యాన్ని మరలా మరలా చేయించండి, అలా రోజంతా చేయనివ్వండి. అక్కడే స్థానికంగా హాస్యాస్పదమైన కలాకృతులను చేయండి, సామ్రాజ్యములోని కళాకృతులను చేయండి. వీటిని ప్రపంచములో ఎక్కడినుండైనా సులభంగా తీసివేయడానికి లేక సులభంగా కనిపెట్టడానికి తక్కువ ధరకే ఉండే వస్తువులనే వాడండి. రాజ భవనములోని తరగతిలో పిల్లలందరూ క్లిష్టమైన వినోదాలను మరియు విభిన్నమైన ఆటలను ఆడుతూ పడుతూనే పరిష్కరిస్తారు. పాఠమును అనుసరించి నిజ జీవితానికి సంబంధించిన సమస్యలను గూర్చి ఆలోచించే అవకాశమును పెద్ద విద్యార్థులు కలిగియుంటారు. పాఠమును ఆచరణలో పెట్టేందుకు సహాయపడునట్లు ప్రతియొక్క విద్యార్థి ప్రతిరోజూ ఒక ఇంటిపనిని పొందుకుంటారు. దానియేలును, ఎస్తేరును కలుసుకోవడమును మరియు వారినుండి బైబిలు కథలను వినడమును పిల్లలందరూ ఎంతగానో ఇష్టపడుతారు, ఆ తరువాత దానియేలు విభాగములో నాటికలు వేయడములో ఆసక్తికరమైన చర్యలను చేయుటకు ఇష్టపడుతారు. అవును నిజమే, ఆట పాటలు లేకుండా ఎటువంటి విబిఎస్ కూడా సంపూర్ణము కాదు! ఆటల తోటలో మరియు రాజరికపు విందు భోజనము విభాగములలో మంచి మంచి ఆటలను మరియు చిరు తిండులను ప్రవేశపెట్టండి. మీ విబిఎస్ కార్యక్రమమును అలంకరించండి మరియు వినోదముగా ఉండునట్లు అదనపు ఆలోచనలను కలిగియుండాలని మరచిపోకండి!